ఉప ముఖ్యమంత్రి నటనపై కేసు

నటనపై చట్టపరమైన నిషేధం లేదన్న ఏపీ హైకోర్టు పిటిషన్ కొట్టివేత స్పాట్ వాయిస్, వరంగల్: ఆంధ్రప్రదేశ్‌లో ఉప ముఖ్యమంత్రి హోదాలో కొనసాగుతూ సినిమాల్లో నటిస్తున్న అంశంపై దాఖలైన పిటిషన్‌ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొట్టివేసింది. ఈ పిటిషన్‌ను ఒక మాజీ ఐఏఎస్ అధికారి దాఖలు చేశారు. పిటిషన్‌లో, కీలక రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి వాణిజ్య కార్యకలాపమైన సినిమా నటనలో పాల్గొనడం తగదని, ఇది ప్రజా సేవపై ప్రభావం చూపుతుందని పిటిషనర్ వాదించారు. ఉప ముఖ్యమంత్రి పూర్తిస్థాయిలో ప్రభుత్వ బాధ్యతలపైనే దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని...