ePaper
Friday, March 20, 2026
ads
ePaper
Homeఎడిటోరియల్సినిమా పైరసీపై కఠిన చర్యలు

సినిమా పైరసీపై కఠిన చర్యలు

📰 Generate e-Paper Clip

స్పాట్ వాయిస్, సినిమా: తెలంగాణ రాష్ట్రంలో సినిమా పైరసీని అరికట్టేందుకు టీజీ సైబర్ సెక్యూరిటీ బ్యూరో కఠిన చర్యలు చేపట్టింది. పైరసీకి పాల్పడిన వారిపై మూడేళ్ల వరకు జైలు శిక్ష విధించడంతో పాటు రూ.3 లక్షల వరకు జరిమానా లేదా సినిమా నిర్మాణ వ్యయంలో 5 శాతం వరకు జరిమానా విధించనున్నట్లు అధికారులు హెచ్చరించారు. ఈ విషయాన్ని సీఎస్‌బీ డైరెక్టర్ శిఖా గోయల్ సోమవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. సినిమా రంగానికి భారీ నష్టం కలిగిస్తున్న పైరసీని పూర్తిగా నిర్మూలించేందుకు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్‌తో కలిసి ప్రత్యేక యాంటీ-పైరసీ యూనిట్‌ను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ప్రజలు చట్టాన్ని గౌరవించి పైరసీకి దూరంగా ఉండాలని సూచించారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular