
మినిమం బ్యాలెన్స్ పేరిట రూ.19 వేల కోట్ల వసూళ్లు.
పేదలపై వేల కోట్ల భారం అంటూ రాఘవ్ చద్దా ఆగ్రహం
స్పాట్ వాయిస్, వరంగల్ : పార్లమెంట్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా బ్యాంకుల మినిమం బ్యాలెన్స్ పెనాల్టీలపై తీవ్రంగా స్పందించారు. గత మూడు సంవత్సరాల్లో బ్యాంకులు కనీస నిల్వ లేదనే కారణంతో సుమారు రూ.19 వేల కోట్లు వసూలు చేశాయని ఆయన వెల్లడించారు. ఈ వసూళ్లు ధనికుల నుంచి కాకుండా సాధారణ ప్రజల నుంచే తీసుకున్నారని అన్నారు.
భారీ వసూళ్లు
ప్రైవేట్ బ్యాంకులు: రూ.11 వేల కోట్లు
ప్రభుత్వ బ్యాంకులు: రూ.8 వేల కోట్లు
పేదలపై భారంగా మారిన పెనాల్టీలు
రోజువారీ కూలీలు, రైతులు, పెన్షనర్లు వంటి వర్గాలు అత్యవసర అవసరాల కోసం ఖాతాలోని డబ్బు తీసుకున్నప్పుడు బ్యాలెన్స్ తగ్గిపోతుంది. అలాంటి పరిస్థితుల్లో కూడా బ్యాంకులు పెనాల్టీలు విధించడం అన్యాయమని ఆయన ప్రశ్నించారు.
“పేదలపై పన్ను”
ఈ విధానాన్ని రాఘవ్ చద్ధా “పేదలపై విధించిన పన్ను”గా అభివర్ణించారు. బ్యాంకింగ్ వ్యవస్థ సామాన్య ప్రజలకు సహకరించాల్సిన సమయంలో ఇలా భారంగా మారుతోందని విమర్శించారు.
జన్ ధన్ ఖాతాలకు మాత్రమే మినహాయింపు
Pradhan Mantri Jan Dhan Yojana ఖాతాలకు మినిమం బ్యాలెన్స్ అవసరం లేకపోయినా, సాధారణ సేవింగ్స్ ఖాతాలపై మాత్రం ఈ నిబంధన కొనసాగుతోంది.
పెనాల్టీల రద్దు డిమాండ్
ఈ నేపథ్యంలో మినిమం బ్యాలెన్స్ పెనాల్టీలను తక్షణమే రద్దు చేయాలని, కేంద్ర ప్రభుత్వం మరియు Reserve Bank of India జోక్యం చేసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.