అడవిలో ఓ మానవీయ స్పర్శ…
మావోయిస్టులతో కలిసి ఎస్సై భోజనం ఛత్తీస్‌గఢ్ అడవుల్లో మానవీయ ఘటన స్పాట్ వాయిస్, వరంగల్: ఛత్తీస్‌గఢ్ అడవుల్లో సాధారణంగా వినిపించే కథలు భయానకంగా ఉంటాయి — తుపాకీ శబ్దాలు, ఎదురు దాడులు, నిత్యం ఉద్రిక్తత. కానీ అదే అడవిలో ఆదివారం ఒక చిన్న మానవీయ ఘటన చోటుచేసుకుంది… మనసులను తాకేలా. కాంకేర్ జిల్లాలోని దండకారణ్యం అడవుల్లో ముగ్గురు మావోయిస్టులు లొంగిపోవడానికి వస్తున్నారనే సమాచారం పోలీసులకు అందింది. ఆ సమాచారం తెలుసుకున్న పార్తాపూర్ ఎస్సై రామేశ్వర్ చతుర్వేది, ఎలాంటి భద్రతా దళాల ఆర్భాటం లేకుండా స్వయంగా...