*కరీంనగర్ టూ టౌన్ ఎస్సై భార్య ఆత్మహత్య*
స్పాట్ వాయిస్, కరీంనగర్ : కరీంనగర్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. టూ టౌన్ ఎస్సై చంద్రశేఖర్ భార్య దివ్య ఆత్మహత్య చేసుకుoది. మంగళవారం గన్నేరు పప్పు దంచుకుని తినడంతో ఆమెను కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్సపొందుతూ దివ్య చనిపోయింది. మృతదేహాన్ని కరీంనగర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కడుపునొప్పి భరించలేక ఆత్మహత్య చేసుకుందని చెబుతున్నప్పటికీ పోలీసులు ఇంకా నిర్ధారించలేదు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.