మూడేళ్ల కొడుకుతో ఎస్సారెస్పీ కాలువలో దూకిన తల్లి

స్పాట్ వాయిస్, వర్ధన్నపేట: వర్ధన్నపేట మండలంలో తీవ్ర విషాదం నెలకొంది. మూడేళ్ల పసికందుతో సహా ఓ తల్లి ఎస్సారెస్పీ కాలువలోకి దూకి బలవన్మరణానికి పాల్పడింది. ఈ హృదయవిదారక ఘటన శనివారం మండల పరిధిలోని కట్రియాల గ్రామ శివారులో జరిగింది. ​స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కట్రియాల గ్రామానికి చెందిన కామిండ్ల కళ్యాణి (30) మూడేళ్ల కుమారుడు శ్రేష్యాన్స్ తో కలిసి గ్రామ శివారులోని ఎస్సారెస్పీ కాలువలో దూకింది. కాలువలో నీటి ఉధృతి ఎక్కువగా ఉండటంతో ఇద్దరూ నీట మునిగి ప్రాణాలు కోల్పోయారు.వివరాల్లోకి వెళ్తే...