జాతీయ రహదారిపై పనులు..: వన్ వే ఏర్పాటు

స్పాట్ వాయిస్, దామెర: మండల పరిధిలోని ఊరుగొండ - NSR హోటల్ మధ్య శనివారం నుంచి వారం రోజుల పాటు రోడ్డు మరమ్మతులు చేపడుతున్నారని దామర ఎస్సై కొంకా అశోక్ తెలిపారు. రోడ్డు పనుల నేపథ్యంలో నేటి నుంచి వారం పాటు వన్-వే అమలులో ఉంటుందని చెప్పారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా ఓవర్ టేకింగ్‌లు చేయొద్దని దామెర ఎస్సై అశోక్ విజ్ఞప్తి చేసారు. నేటి నుంచి వారం రోజుల పాటు జాతీయ రహదారిపై నెమ్మదిగా వెళ్లాలని వాహనదారులకు సూచించారు. ఊరుగొండ మార్గంలో ప్రయాణించే వారు...