SPOT VOICE
Newspaper Banner
Date : 28 March 2026, 11:19 am Posted By : SPOT VOICE MEDIA

జాతీయ రహదారిపై పనులు..: వన్ వే ఏర్పాటు

స్పాట్ వాయిస్, దామెర: మండల పరిధిలోని ఊరుగొండ – NSR హోటల్ మధ్య శనివారం నుంచి వారం రోజుల పాటు రోడ్డు మరమ్మతులు చేపడుతున్నారని దామర ఎస్సై కొంకా అశోక్ తెలిపారు. రోడ్డు పనుల నేపథ్యంలో నేటి నుంచి వారం పాటు వన్-వే అమలులో ఉంటుందని చెప్పారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా ఓవర్ టేకింగ్‌లు చేయొద్దని దామెర ఎస్సై అశోక్ విజ్ఞప్తి చేసారు. నేటి నుంచి వారం రోజుల పాటు జాతీయ రహదారిపై నెమ్మదిగా వెళ్లాలని వాహనదారులకు సూచించారు. ఊరుగొండ మార్గంలో ప్రయాణించే వారు ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ పోలీసులకు సహకరించాలని దామెర ఎస్సై కోరారు.