తండ్రికూతుళ్ల సజీవదహనానికి అల్లుడే కారణమా..?
స్పాట్ వాయిస్,కాజీపేట: కాజీపేట మండలం కడిపికొండ గ్రామంలో జరిగిన తండ్రి కూతుళ్ళ సజీవ దహన ఘటన... తీవ్ర విషాదాన్ని నింపింది. హైదరాబాదులో ఉండే రాజశ్రీ-ప్రవీణ్ దంపతులు.. రెండు రోజుల క్రితమే కడిపికొండకు వచ్చినట్లు తెలిసింది. వీరికి ఇద్దరు సంతానం కాగా కూతురి అన్నప్రాసన కార్యక్రమం కోసం వచ్చినట్లు సమాచారం. మంగళవారం కార్యక్రమం పూర్తి అయిన తర్వాత.. ఏమైందో ఏమో కానీ తెల్లవారుజామున.. ఇంట్లో నుంచి మంటలు వచ్చాయి. గమనించిన స్థానికులు.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చేలోపే రాజశేఖర్, కూతురు రాజశ్రీ మంటల్లో కాలిపోయారు....