ePaper
Tuesday, March 10, 2026
ads
ePaper
Homeతెలంగాణఇనుగాల రాధికకు డాక్టరేట్

ఇనుగాల రాధికకు డాక్టరేట్

📰 Generate e-Paper Clip

స్పాట్ వాయిస్, హన్మకొండ : హనుమకొండ ప్రశాంత్ నగర్ కు చెందిన ఇనుగాల రాధికకు హైదరాబాదులోని చైతన్య డీమ్డ్ టు బీ యూనివర్సిటీ డాక్టరేటును ప్రదానo చేసింది. ‘ఏ స్టడీ ఆన్ సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ప్యాటర్న్ ఆఫ్ పబ్లిక్ సెక్టార్ ఎంప్లాయిస్ విత్ స్పెషల్ రిఫరెన్స్ టు తెలంగాణ స్టేట్’ అనే అంశంపై ప్రొఫెసర్ జి ఉషశ్రీ పర్యవేక్షణలో పరిశోధనను పూర్తి చేసినందుకు డాక్టరేట్ అందజేశారు. రాధిక ప్రస్తుతం హనుమకొండ హంటర్ రోడ్డులోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళ డిగ్రీ కళాశాలలో కామర్స్ అధ్యాపకురాలిగా పనిచేస్తున్నారు. ఈ సందర్భంగా రాధికను కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీలత, అధ్యాపక బృందం అభినందించారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular