కేయూలో విద్యార్థుల కొట్లాట
చికెన్ విషయంలో రెండు డిపార్ట్మెంట్ విద్యార్థుల మధ్య వివాదం స్పాట్ వాయిస్, ఓరుగల్లు: కాకతీయ యూనివర్సిటీలో కోడికూర విషయంలో తలెత్తిన గొడవ తలలు పగిలే వరకు వెళ్లింది. ఎకానమిక్స్, ఎంబీఏ విద్యార్థుల మధ్య ఘర్షణ చిలికిచిలికి గాలివానగా మారి యూనివర్సిటీలో ప్రశాంతతను చెదరగొట్టింది. ఎకనామిక్స్ విద్యార్థులకు ఏబీవీపీ లీడర్లు తోడవంతో ఎంబీఏ విద్యార్థుల తలలు పగిలాయి. ఈ ఘటనలో ఇరువర్గాలపై కేసు నమోదైంది. దీంతో కేయూలో పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేశారు. ఆదివారం యూనివర్సిటీ హాస్టల్స్ లో మెస్ కమిటీ ఎకనామిక్స్, కామర్స్ డిపార్ట్...