Date : 26 February 2026, 10:05 am Posted By : SPOT VOICE MEDIA
హనుమకొండ కలెక్టర్ గా చాహత్ బాజ్‌పాయ్
వరంగల్ మున్సిపల్ కమిషనర్ గా పనిచేస్తున్న చాహత్ బాజ్‌పాయ్ హనుమకొండ జిల్లా కలెక్టర్ బదిలీ అయ్యారు. హనుమకొండ జిల్లా కలెక్టర్‌గా పనిచేస్తున్న స్నేహా శబరీష్ మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ గా బదిలీ కావడంతో ఆ స్థానంలో చాహత్ బాజ్‌పాయ్‌ను ప్రభుత్వం నియమించింది. చాహత్ బాజ్‌పాయ్ హనుమకొండ జిల్లా కలెక్టర్ బాధ్యతలతో పాటు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపల్ కమిషనర్ పదవిని అదనపు బాధ్యతలుగా కొనసాగించనున్నారు.వరంగల్ అదనపు కలెక్టర్‌గా వై.వి. గణేష్ నియామకం అయ్యారు.